Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడలో డూండి గణపతి ఉత్సవాలకు హాజరైన మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh attends Doondi Ganapathi celebrations in Vijayawada
Advertisement
  • విజయవాడ డూండి గణపతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్
  • 72 అడుగుల భారీ మట్టి విగ్రహానికి ప్రత్యేక పూజలు
  • కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, బుద్దా వెంకన్న
  • భవానీపురంలో ఘనంగా కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు
Advertisement
విజయవాడ నగరంలోని భవానీపురంలో డూండి గణేశ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా 72 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంత్రి లోకేశ్‌తో పాటు ఈ పూజా కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ బుద్దా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ తదితరులు పాల్గొన్నారు. డూండి గణేశ్ సేవా సమితి వ్యవస్థాపకులు డూండి రాకేశ్, ఇతర ప్రతినిధులు మంత్రికి స్వాగతం పలికి, స్వామివారి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ప్రతి ఏటా విజయవాడలో డూండి గణపతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. భారీ విగ్రహం, వైవిధ్యభరితమైన అలంకరణతో ఈ మండపం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ఏడాది కూడా పర్యావరణ హితంగా 72 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
Advertisement
Advertisement
Nara Lokesh
Vijayawada Doondi Ganesh
Ganesh Navratri Celebrations
Kesineni Sivanath
72 Feet Clay Ganesha
Andhra Pradesh News

More Telugu News